Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

వాస్తు, జ్యోతిష రంగాల్లో విశేష సేవలకు గుర్తింపు: ప్రముఖ పండితుడు గడ్దాస్ సత్యనారాయణకు గౌరవ డాక్టరేట్

Author Boini venu | 25 Oct 2026, 08:18 PM | advt.
వాస్తు, జ్యోతిష రంగాల్లో విశేష సేవలకు గుర్తింపు: ప్రముఖ పండితుడు గడ్దాస్ సత్యనారాయణకు గౌరవ డాక్టరేట్

1. శుక్రాచార్య వేదాంగ వర్చువల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో పురస్కార ప్రదానం 

2. తిరుపతిలో ఘనంగా జరిగిన వైదిక జ్యోతిష్య సమ్మేళనం

3. సత్యనారాయణ ప్రతిభకు దక్కిన గౌరవమని ప్రశంసలు

ఇవి కూడా చదవండి

4. హర్షం వ్యక్తం చేసిన తోటి ఉపాధ్యాయులు

తెలంగాణ అడ్డా ప్రతినిధి సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని తంగళ్లపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ ఉపాధ్యాయులు, వాస్తు-జ్యోతిష పండితులు గడ్దాస్ సత్యనారాయణకు ప్రతిష్టాత్మక గౌరవ డాక్టరేట్ లభించింది. 
ఆదివారం తిరుపతిలో విశ్వజ్యోతి విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో వైదిక జ్యోతిష్య, సనాతన ధర్మ సమ్మేళనం అత్యంత వైభవంగా జరిగింది. సమాజానికి చేసిన విశిష్ట సేవలు, వేద విజ్ఞానం, విశ్వకర్మ వాస్తు పరిశోధనల్లో ఆయన కనబరిచిన ప్రతిభకు గుర్తింపుగా బెంగళూరుకు చెందిన శుక్రాచార్య వేదాంగ వర్చువల్ యూనివర్సిటీ వారు సత్యనారాయణకు 'డాక్టరేట్ ఆఫ్ ఫిలాసఫీ (Ph.D Honoris Causa)' పురస్కారాన్ని అందజేశారు. సంస్థ ప్రతినిధులు, పీఠాధిపతుల సమక్షంలో ఈ పట్టాను ఆయనకు ప్రదానం చేశారు. 
గడ్దాస్ సత్యనారాయణ బోయినపల్లి మండల పరిధిలోని బూర్గుపల్లిలో ఉపాధ్యాయుడిగా సేవలందిస్తూనే, విద్యారంగంతో పాటు వాస్తు, జ్యోతిష శాస్త్రాలలో విశేషమైన సేవలందిస్తూ ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయనకు డాక్టరేట్ రావడం పట్ల బోయినపల్లి, తంగళ్లపల్లి మండలాల ప్రజలు, తోటి ఉపాధ్యాయులు, మిత్రులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు. ఆయన మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.