Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పోలీసుల దౌర్జన్యానికి గురైన జర్నలిస్టులను పరామర్శించిన 'తెలంగాణ అడ్డా' జిల్లా బ్యూరో చీఫ్ మహమ్మద్ అజీమ్

Author | 15 Oct 2026, 02:07 PM |
పోలీసుల దౌర్జన్యానికి గురైన జర్నలిస్టులను పరామర్శించిన 'తెలంగాణ అడ్డా' జిల్లా బ్యూరో చీఫ్ మహమ్మద్ అజీమ్

తప్పుడు కేసులు నమోదు చేసి, థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ఘోరం

తీవ్ర హింసను రికార్డు చేసి, సొంత పూచీకత్తుపై విడుదల చేసిన మేజిస్ట్రేట్ గారు - 21 రోజుల సమయం మంజూరు

పోలీసుల దౌర్జన్యానికి గురైన జర్నలిస్టులను పరామర్శించిన 'తెలంగాణ అడ్డా' జిల్లా బ్యూరో చీఫ్ మహమ్మద్ అజీమ్ - Additional Image

ఆర్టికల్ 19(1)(a) ప్రకారం జర్నలిస్టుల స్వేచ్ఛను కాపాడుకుంటాం - 'తెలంగాణ అడ్డా' జిల్లా బ్యూరో చీఫ్ మహమ్మద్ అజీమ్

ఇవి కూడా చదవండి

జర్నలిస్టులు సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై వార్తా కథనాలు రాస్తే, వారిపై తప్పుడు కేసులు బనాయించి థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టని 'తెలంగాణ అడ్డా' కరీంనగర్ జిల్లా బ్యూరో చీఫ్ మహమ్మద్ అజీమ్ పేర్కొన్నారు.
కరీంనగర్ జిల్లా కేంద్ర ఆసుపత్రిలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం వెనుక వైపు ఉన్న సర్జికల్ వార్డులో చికిత్స పొందుతున్న 'ఏక్ దమ్ న్యూస్' ఎడిటర్ శేఖర్, బ్యూరో జర్నలిస్ట్ సంపత్ లను మహమ్మద్ అజీమ్ తోటి జర్నలిస్టులతో కలిసి పరామర్శించారు.
ఈ సందర్భంగా జర్నలిస్టులు తమకు జరిగిన ఘోరాన్ని 'తెలంగాణ అడ్డా' ప్రతినిధులకు వివరిస్తూ... ఒక అంశంపై వరుసగా తొమ్మిది వార్తా కథనాలు ప్రచురించినందుకు ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాల్సింది పోయి, తమపై క్రిమినల్ కేసులు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను అదుపులోకి తీసుకుని, తీవ్రంగా వేధిస్తూ, థర్డ్ డిగ్రీ ప్రయోగించి, బూట్లు నాకిస్తూ తీవ్ర హింసకు గురిచేసిన తీరును జర్నలిస్టులు వెల్లడించారు.పోలీసులు రిమాండ్ నిమిత్తం జడ్జి/మేజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరిచిన సమయంలో, పోలీసులు తమను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన తీరును, జరిగిన నిజాలను మేజిస్ట్రేట్ గారికి వివరించినట్లు తెలిపారు. జర్నలిస్టులను తీవ్రంగా హింసించిన విషయాలను పరిశీలించి రికార్డు చేసుకున్న మేజిస్ట్రేట్ గారు, తమ సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేస్తూ, వివరణ నిమిత్తం 21 రోజుల సమయం ఇచ్చారని జర్నలిస్టులు వెల్లడించారు.జర్నలిస్టులు వివరించిన సంఘటనను విన్న అనంతరం 'తెలంగాణ అడ్డా' కరీంనగర్ జిల్లా బ్యూరో చీఫ్ మహమ్మద్ అజీమ్ మాట్లాడుతూ... మేజిస్ట్రేట్ గారు సొంత పూచీకత్తుపై విడుదల చేయడంతోనే పోలీసుల తీరుఎలాంటిదో స్పష్టంగా అర్థమవు తోందన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) ద్వారా లభించిన భావప్రకటన స్వేచ్ఛకు, అలాగే వార్తలకు సంబంధించి సేకరించిన ఆధారాలను భద్రపరుచుకునే హక్కుకు లోబడి, రాజ్యాంగ బద్ధంగా జర్నలిస్టులు తమ విధులను నిర్వర్తిస్తారని స్పష్టం చేశారు. జర్నలిస్టులపై జరుగుతున్న అక్రమ కేసులు, బెదిరింపులను ఖచ్చితంగా తిప్పికొడతామని, చట్టానికి లోబడి బాధితులకు అండగా నిలుస్తూ వార్తలు రాస్తామని మహమ్మద్ అజీమ్ తెలిపారు. జర్నలిస్టులకు 'తెలంగాణ అడ్డా' పత్రిక ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఈ పరామర్శ కార్యక్రమంలో తోటి జర్నలిస్టులు పాల్గొని వారికి మనోధైర్యాన్ని నింపారు.