Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

రూ.1.75 కోట్లతో సెంట్రల్ లైటింగ్ ప్రారంభించిన.. పినపాక ఎమ్మెల్యే, పాయం వెంకటేశ్వర్లు...

Author | 14 Oct 2026, 07:59 PM |
రూ.1.75 కోట్లతో సెంట్రల్ లైటింగ్ ప్రారంభించిన.. పినపాక ఎమ్మెల్యే,  పాయం వెంకటేశ్వర్లు...

తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి).

మణుగూరు సమితి సింగారం గ్రామపంచాయతీ పరిధిలో పట్టణ అభివృద్ధిలో భాగంగా జూనియర్ కళాశాల నుంచి రైల్వే గేట్ వరకు రూ.1 కోటి 75 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్‌ను పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు బుధవారం బ్రాహ్మణుడి మంత్రోచ్ఛరణలతో ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. మణుగూరు పట్టణాన్ని మరింత సంద ర్భంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించ డమే లక్ష్యంగా అభివృద్ధి పనులకు ప్రాధా న్యత ఇస్తున్నామని తెలిపారు.పట్టణం లోని ప్రధాన రహదారులపై సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం వల్ల రాత్రి వేళల్లో వెలుతురు పెరిగి, ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నా రు.ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రహదారులు, వీధి దీపాలు, ఇతర మౌలిక సదుపా యాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం లో, పినపాక నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకె ళ్తున్నామని వెల్లడించారు.మణుగూరు పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే ఇందిరమ్మ పాలన లక్ష్యమని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నా రు.ఈకార్యక్రమంలో సమితి సింగారం గ్రామపంచాయతీ సర్పంచ్ కలబోయిన మాధవరావు ఉప సర్పంచ్ గాండ్ల సురేష్, ఎంపీడీవో,మండల అధ్యక్షులు పిరినాకి నవీన్,టౌన్ అధ్యక్షులు కురం రవి ముదిరాజ్, జిల్లా ముఖ్య నాయ కులు, సర్పంచులు,ఉపసర్పంచు లు,వార్డు సభ్యులు,ముఖ్య నాయకులుమహిళా అధ్యక్షురాలు,మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...

రూ.1.75 కోట్లతో సెంట్రల్ లైటింగ్ ప్రారంభించిన.. పినపాక ఎమ్మెల్యే,  పాయం వెంకటేశ్వర్లు... - Additional Imageరూ.1.75 కోట్లతో సెంట్రల్ లైటింగ్ ప్రారంభించిన.. పినపాక ఎమ్మెల్యే,  పాయం వెంకటేశ్వర్లు... - Additional Image