Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

రూ.5 లక్షల ఎల్‌ఓసీ అందజేసిన పినపాక ఎమ్మెల్యే... పాయం...

Author | 14 Oct 2026, 04:45 PM |
రూ.5 లక్షల ఎల్‌ఓసీ అందజేసిన పినపాక ఎమ్మెల్యే... పాయం...

తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి).

పినపాక మండలం పొట్లపల్లి గ్రామాని కి చెందిన వాళ్లేపోగు వెంకటేశ్వర్లు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడు తున్న నేపథ్యంలో,ఆయన వైద్య చికిత్స నిమిత్తం రూ.5 లక్షల విలువైన ఎల్‌ఓసీని పినపాక ఎమ్మెల్యే,తెలంగాణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంక టేశ్వర్లు బుధవారం తన క్యాంపు కార్యాల యంలో అందజేశారు.ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్య చికిత్స పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుం బాలకు అండగా నిలవాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రభు త్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తోందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.అనా రోగ్యంతో బాధపడుతు న్న వారికి మెరుగైన వైద్య చికిత్స అందిం చేందుకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం ఎంతగానో ఉపయోగప డుతుం దని తెలిపారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమం,ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్య తనిస్తూ ముందుకు సాగుతోందని పేర్కొ న్నారు.ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలవడం,వారికి అవసరమైన సహాయం అందించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.ప్రజలకు వైద్యపరమైన ఇబ్బందులు ఎదురై నప్పుడు అర్హత మేరకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం పొందవచ్చని,అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం చేకూరేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే పాయం.వెంకటేశ్వర్లు భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పొట్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ మద్దెల సమ్మయ్య,మాజీ సర్పంచ్ తోలేం కళ్యాణి,సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తోలేం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.