Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

శివానంద హాస్పిటల్‌పై సమగ్ర విచారణ జరపాలి ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు!

Author | 12 Oct 2026, 08:49 PM | TELANGANA, ఆరోగ్యం
శివానంద హాస్పిటల్‌పై సమగ్ర విచారణ జరపాలి ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు!

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ

ఆసుపత్రి యాజమాన్యంపై వచ్చిన అక్రమాల ఆరోపణలపై తక్షణ చర్యలు తీసుకోవాలి

శివానంద హాస్పిటల్‌పై సమగ్ర విచారణ జరపాలి ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు! - Additional Image

డిఎం & హెచ్‌ఓ (జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి) విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్

కరీంనగర్ నగరపాలక సంస్థ 27వ డివిజన్ కార్పొరేటర్ బోట్ల శ్యామల–తాగేళ్ళ కిరణ్ కుమార్ డిమాండ్

కరీంనగర్, అక్టోబర్ 12 (తెలంగాణ అడ్డ):

కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 'శివానంద చిల్డ్రన్ & మెటర్నిటీ హాస్పిటల్'లో జరుగుతున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న తీవ్ర నిబంధనల ఉల్లంఘనలు, స్కానింగ్ మరియు ల్యాబ్ రిఫరల్ కమిషన్లు, రోగుల నుంచి అధిక వసూళ్లు, ఇతర అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని 27వ డివిజన్ కార్పొరేటర్ బోట్ల శ్యామల–తాగేళ్ళ కిరణ్ కుమార్ డిమాండ్ చేశారు.

ఈ మేరకు సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు లేఖ ద్వారా సమగ్ర ఫిర్యాదు సమర్పించినట్లు తెలిపారు. కార్పొరేటర్ అందించిన ఫిర్యాదుపై వెంటనే స్పందించిన కలెక్టర్, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారికి (డిఎం & హెచ్‌ఓ) ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

కార్పొరేటర్ ఆరోపించిన ప్రధాన సమస్యలు ఇవే:

ఛార్జీల పట్టిక లోపం: ఆసుపత్రి ప్రాంగణంలో వైద్యుల పేర్లు, విద్యార్హతలు, మెడికల్ రిజిస్ట్రేషన్ సంఖ్యలు, అనస్థీషియా వైద్యుల వివరాలు, వైద్య సేవల ధరల పట్టిక ప్రదర్శించడం లేదని తెలిపారు. రాత్రి 9 గంటల తర్వాత రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నారని విమర్శించారు.

రిఫరల్ కమిషన్ల దందా:

రాధిక ఫెటోకేర్' వంటి నిర్దిష్ట స్కానింగ్ కేంద్రాలకు మాత్రమే రోగులను పంపుతున్నారని, ఇతర కేంద్రాల్లో చేయించుకున్న స్కానింగ్ రిపోర్టులను నిరాకరిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారం వెనుక ఉన్న రిఫరల్ కమిషన్లపై విచారణ చేపట్టాలని కోరారు.

నకిలీ బిల్లులు - ఏజెన్సీ కోడ్లు:

మందుల పేర్లు స్పష్టంగా రాయకుండా ఏజెన్సీ కోడ్లు ఉపయోగిస్తున్నారని, రోగుల నుంచి సరైన బిల్లులు ఇవ్వకుండా కేవలం వాట్సాప్ సందేశాలు మాత్రమే చూపిస్తూ అధిక ధరలకు మందులు అమ్ముతున్నారని మండిపడ్డారు.
భద్రతా అనుమతులపై అనుమానాలు: ఆసుపత్రి భవనానికి సంబంధించిన పార్కింగ్, సెట్‌బ్యాక్, అగ్నిమాపక భద్రత (ఫైర్ సేఫ్టీ అనుమతులు), ఆక్సిజన్ పైప్‌లైన్ వ్యవస్థపై అనుమానాలు ఉన్నాయని, అత్యవసర సమయాల్లో రోగులను వేరే ఆసుపత్రులకు తరలిస్తున్న పరిస్థితి ఉందన్నారు.

అదనపు వసూళ్లు:
చివరికి ఇంజెక్షన్లు ఇవ్వడానికి కూడా నర్సులు, సిబ్బంది రూ. 50 చొప్పున వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆకస్మిక తనిఖీలు చేసి లైసెన్స్ రద్దు చేయాలి:
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఫైర్ సర్వీసెస్, మున్సిపల్ అధికారులతో కూడిన ప్రత్యేక బృందం ద్వారా శివానంద ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని కార్పొరేటర్ డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్లు, బిల్లులు, ఫైర్ అనుమతి పత్రాలు మరియు ఇతర రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల ఉల్లంఘనలు నిర్ధారణ అయితే ఆసుపత్రి లైసెన్స్ రద్దు చేయాలని స్పష్టం చేశారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం, పారదర్శక ఫీజుల విధానాన్ని పాటించడం అధికారుల ప్రాథమిక బాధ్యత అని బోట్ల శ్యామల–తాగేళ్ళ కిరణ్ కుమార్ పేర్కొన్నారు.