Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఉత్తమ ఉపాధ్యాయుడు పాలోజు ఆంజనేయులుకు ఘన సన్మానం మార్కండేయ నగర్ వీరబ్రహ్మేంద్రస్వామి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం

Author TELANGANA ADDA NEWS | 10 Oct 2026, 06:37 PM | Politics
ఉత్తమ ఉపాధ్యాయుడు పాలోజు ఆంజనేయులుకు ఘన సన్మానం  మార్కండేయ నగర్ వీరబ్రహ్మేంద్రస్వామి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం

కరీంనగర్, తెలంగాణ అడ్డా:

ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న పాలోజు ఆంజనేయులును మార్కండేయ నగర్ శ్రీమద్విరాట్ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5న ఆయనకు ఈ అవార్డు లభించడంతో సంఘం ప్రతినిధులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.

కరీంనగర్ జిల్లా నల్లగుంటపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎస్‌జీటీ ఉపాధ్యాయుడిగా సేవలందిస్తున్న పాలోజు ఆంజనేయులు విద్యారంగానికి చేస్తున్న సేవలను గుర్తించి ఈ పురస్కారం అందుకోవడం అభినందనీయమని సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. విశ్వకర్మ సమాజానికి చెందిన ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ఆయన సాధించిన గుర్తింపు ఉపాధ్యాయ వర్గానికి, విశ్వకర్మ సమాజానికి గర్వకారణమని అన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు పాములపర్తి వేణుగోపాల చారి, సంఘం అధ్యక్షుడు పాములపర్తి శ్రీనివాస చారి, కార్యదర్శి కలికోట శ్రీనివాస్, కోశాధికారి కలికోట శివప్రసాద్, కాసర్ల శ్రీనివాస్, కాయితోజు ఆనందం పాల్గొన్నారు. ముఖ్య సలహాదారులు రామస్వామి, ఖడార్ల వేణుగోపాల్, రాంప్రసాద్‌తో పాటు విశ్వకర్మ బంధువులు పాల్గొని పాలోజు ఆంజనేయులును అభినందించారు.