ఉత్తమ ఉపాధ్యాయుడు పాలోజు ఆంజనేయులుకు ఘన సన్మానం మార్కండేయ నగర్ వీరబ్రహ్మేంద్రస్వామి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం

కరీంనగర్, తెలంగాణ అడ్డా: ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న పాలోజు ఆంజనేయులును మార్కండేయ నగర్ శ్రీమద్విరాట్ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5న ఆయనకు ఈ అవార్డు లభించడంతో సంఘం ప్రతినిధులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. కరీంనగర్ జిల్లా నల్లగుంటపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎస్‌జీటీ ఉపాధ్యాయుడిగా సేవలందిస్తున్న పాలోజు ఆంజనేయులు విద్యారంగానికి చేస్తున్న సేవలను గుర్తించి ఈ పురస్కారం అందుకోవడం అభినందనీయమని సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. విశ్వకర్మ సమాజానికి చెందిన ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ఆయన సాధించిన గుర్తింపు...