Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

జీవో నెంబర్ 6 ప్రకారం వేతనాలు చెల్లించాలి....

Author | 07 Oct 2026, 04:28 PM |
జీవో నెంబర్ 6 ప్రకారం వేతనాలు చెల్లించాలి....

పిఎఫ్, ఈఎస్ఐ తదితర చట్టబద్ధ హక్కులు, సౌకర్యాలు కల్పించాలి.

టి యు సి ఐ జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి...

తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి).

ఇవి కూడా చదవండి

గ్రామపంచాయతీ కార్మికులకు జీవో నెంబర్ 6 వర్తింపజేసి, జీవో నెంబర్ 6 ప్రకారం వేత నాలు చెల్లించాలని, పిఎఫ్, ఈఎస్ఐ లాంటి చట్టబద్ధ హక్కులు సౌకర్యాలు కల్పించాలని టి యు సి ఐ జిల్లా అధ్యక్షు లు ఆర్. మధుసూదన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం తెలం గాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ (టియుసిఐ) మండల కమిటీ ఆధ్వర్యంలో బుధ వారం ప్రతినిధి బృందం మణుగూరు ఎంపీడీవో కి వినతిపత్రం అందజేశా రు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 67 షెడ్యూల్డ్ జీవోలను రద్దుచేసి జీవో నెంబర్ 6 ని తీసుకువచ్చి, రాష్ట్రంలో మూడు జోన్లుగా విభజించి కార్పొ రేషన్ పరిధిలో కార్మిక వర్గానికి ఆన్ స్కిల్డ్ వేతనం 16 వేల రూపాయలు గాను, మున్సిపాలిటీ పరిధిలోని కార్మిక వర్గానికి 15వేల రూపా యలు గాను,గ్రామీణ ప్రాంత కార్మికులకు 14 వేల రూపాయలు గాను నిర్ణయించిం దన్నారు.ప్రభుత్వం ఇచ్చిన 6 జీవో ప్రకారం గ్రామపంచాయతీ కార్మికు లకు 14 వేల రూపాయలు చెల్లించ వలసి ఉందన్నా రు.చాలీ,చాలని వేతనాలతో పనిచేస్తూ గ్రామపంచా యతీ కార్మికులు కుటుంబ పోషణ భారమై ఆర్థికంగా ఇబ్బంది పడుతు న్నారు అన్నారు.గ్రామపంచాయతీ కార్మికు లకు జీవో నెంబర్ 6 ను వర్తిం పజేసి జీవో నెంబర్ 6 ప్రకారం 14 వేల రూపాయలు చెల్లించాలని, పిఎఫ్,ఈఎస్ఐ తదితర చట్టబద్ధ హక్కులు,సౌకర్యాలు కల్పించా లని, ప్రతినెలా ఒకటవ తారీకు నాడు నేరుగా గ్రామపంచాయతీ కార్మికుల ఖాతాలో జీతాలు జమ చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్( టీ యు సీ ఐ) మణుగూరు మండల నాయకు లు డి. వీరభద్రం తదితరులు పాల్గొన్నారు..