Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

తల్లి,కవల పిల్లలను కాపాడిన వైద్య సిబ్బంది..

Author | 03 Oct 2026, 08:54 PM |
తల్లి,కవల పిల్లలను కాపాడిన వైద్య సిబ్బంది..

అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

తెలంగాణ అడ్డా న్యూస్,,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి).

మణుగూరు, భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రుల వైద్య బృందాలు అర్ధరాత్రి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో సమన్వయంతో పనిచేసి తల్లి, కవల శిశువుల ప్రాణాలను కాపాడిన ఘటనపై పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు.తీవ్రమైన రక్తహీనత, అధిక రక్తపోటు, కవలల గర్భధారణ, రెండో శిశువుకు అబ్స్ట్రక్టెడ్ లేబర్ వంటి అనేక ప్రమాదకర పరిస్థితులు ఉన్నప్పటికీ, వైద్యులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా సకాలంలో తల్లికి, ఇద్దరు శిశువులకు అత్యవసర వైద్య సేవలు అందించడం అభినంద నీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రిలో తొలి శిశువుకు సురక్షితంగా సాధార ణ ప్రసవం నిర్వహించిన అనంతరం, రెండో శిశువుకు అత్యవసర సిజేరి యన్ అవసరమని గుర్తించి వెంటనే భద్రాచలం ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేయడం, అక్కడ వైద్య బృందం సకాలంలో స్పందించి అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించడం వైద్యుల సమన్వయానికి నిదర్శనమని అన్నారు.మారుమూల ప్రాంతాలకు చెందిన గర్భిణులకు సకాలంలో వైద్య సేవలు అందించడంతో పాటు, అవస రమైన సందర్భాల్లో ఉన్నతస్థాయి ఆసుపత్రులతో సమన్వయం చేసుకు ని ప్రాణాలను కాపాడుతున్న ప్రభు త్వ వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఇతర సిబ్బందికి ప్రత్యేక అభినందన లు తెలిపారు.తల్లి,ఇద్దరు కవల శిశువులు ప్రస్తుతం క్షేమంగా ఉండ టం సంతోష. కరమైన విషయమని, ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో కూడా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఎమ్మెల్యే ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి