తల్లి,కవల పిల్లలను కాపాడిన వైద్య సిబ్బంది..
అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలంగాణ అడ్డా న్యూస్,,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి). మణుగూరు, భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రుల వైద్య బృందాలు అర్ధరాత్రి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో సమన్వయంతో పనిచేసి తల్లి, కవల శిశువుల ప్రాణాలను కాపాడిన ఘటనపై పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు.తీవ్రమైన రక్తహీనత, అధిక రక్తపోటు, కవలల గర్భధారణ, రెండో శిశువుకు అబ్స్ట్రక్టెడ్ లేబర్ వంటి అనేక ప్రమాదకర పరిస్థితులు ఉన్నప్పటికీ, వైద్యులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా సకాలంలో తల్లికి, ఇద్దరు శిశువులకు అత్యవసర వైద్య సేవలు అందించడం అభినంద నీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రిలో తొలి శిశువుకు సురక్షితంగా సాధార ణ...