Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఇందిరమ్మ నూతన గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే. పాయం వెంకటేశ్వర్లు..

Author | 03 Oct 2026, 03:18 PM |
ఇందిరమ్మ నూతన గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే. పాయం వెంకటేశ్వర్లు..

తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి).

అశ్వాపురం మండలం తుర్రంవారి గూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నూతనంగా నిర్మించుకున్న ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో పినపాక ఎమ్మెల్యే, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటే శ్వర్లు పాల్గొన్నారు. గ్రామానికి చెందిన లబ్ధిదారులు బానోతు అచ్చమ్మ, బానోతు శైలజ, నూతన గృహాల్లో నిర్వహించిన గృహప్రవేశ వేడుకల్లో పాల్గొని, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియ జేశారు.నూతన గృహాల్లోకి కుటుంబ సభ్యులతో కలిసి అడుగుపెట్టి లబ్ధిదారులతో ఎమ్మెల్యే పాయం ఆత్మీయంగా మాట్లాడి వారి యోగక్షే మాలను అడిగి తెలుసుకున్నారు. సొంతింటి కల నెరవేరిన సందర్భంగా లబ్ధిదారుల కుటుంబాల్లో నెలకొన్న ఆనందాన్ని పంచుకున్నారు.నూతన గృహాల్లో సుఖసంతోషాలతో, ఆయురా రోగ్యాలతో జీవించాలని కోరారు.పేద కుటుంబాలకు సొంతిం టి సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్య మంత్రి .ఎ.రేవంత్ రెడ్డి నాయకత్వంలో, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచా ర పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగు లేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు గృహ వసతి కల్పించే కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.ఎన్నో సంవత్సరాలుగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా తమ సొంత ఇంటిని నిర్మించుకునే అవకాశం లభిస్తోందని తెలిపారు. సొంతిం టి కల నెరవేరడం ప్రతి కుటుంబా నికి ఎంతో ఆనందాన్ని, భరోసాను కలిగించే విషయమని అన్నారు.నూతన గృహం కేవలం నివాసానికి మాత్రమే కాకుండా కుటుంబ భద్రతకు, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా ప్రజాప్రతి నిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయా ల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే తెలిపా రు.గ్రామీణ ప్రాంతా ల్లో పేద కుటుంబాలకు మెరుగైన నివాస వసతులు,మౌలిక సదు పాయాలు అందుబాటులోకి తీసుకురా వడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు. అదే విధంగా తుర్రం వారిగూ డెం గ్రామంలో బానోతు అచ్చమ్మ, బానోతు శైలజ కుటుంబాలు నూతన గృహాల్లోకి ప్రవేశించడం పట్ల గ్రామస్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు అభినం దనలు తెలియజేసి,నూతన గృహాల్లో వారి జీవితం సంతోషంగా సాగాలని ఆకాంక్షిం చారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షు లు ఓరుగంటి రమేష్ బాబు,జిల్లా ముఖ్య నాయకులు,సర్పంచులు,ఉపస ర్పంచులు, వార్డు సభ్యులు,స్థానిక ప్రజాప్రతి నిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ నూతన గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే. పాయం వెంకటేశ్వర్లు.. - Additional Image