ఇందిరమ్మ నూతన గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే. పాయం వెంకటేశ్వర్లు..
తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి). అశ్వాపురం మండలం తుర్రంవారి గూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నూతనంగా నిర్మించుకున్న ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో పినపాక ఎమ్మెల్యే, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటే శ్వర్లు పాల్గొన్నారు. గ్రామానికి చెందిన లబ్ధిదారులు బానోతు అచ్చమ్మ, బానోతు శైలజ, నూతన గృహాల్లో నిర్వహించిన గృహప్రవేశ వేడుకల్లో పాల్గొని, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియ జేశారు.నూతన గృహాల్లోకి కుటుంబ సభ్యులతో కలిసి అడుగుపెట్టి లబ్ధిదారులతో ఎమ్మెల్యే పాయం ఆత్మీయంగా మాట్లాడి వారి యోగక్షే మాలను అడిగి తెలుసుకున్నారు. సొంతింటి కల నెరవేరిన సందర్భంగా లబ్ధిదారుల కుటుంబాల్లో నెలకొన్న ఆనందాన్ని పంచుకున్నారు.నూతన గృహాల్లో సుఖసంతోషాలతో,...