Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి బీసీ సాధికారిత సంఘం ఉత్తర తెలంగాణ జిల్లాల ఇన్‌చార్జి పొలాస నరేందర్

Author TELANGANA ADDA NEWS | 27 Sep 2026, 07:58 PM | Politics
కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి  బీసీ సాధికారిత సంఘం ఉత్తర తెలంగాణ జిల్లాల ఇన్‌చార్జి పొలాస నరేందర్

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి

బీసీ సాధికారిత సంఘం ఉత్తర తెలంగాణ జిల్లాల ఇన్‌చార్జి పొలాస నరేందర్

తెలంగాణ అడ్డా ప్రతినిధి వేములవాడ
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి సందర్భంగా బీసీ సాధికారిత సంఘం ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీసీ సాధికారిత సంఘం ఉత్తర తెలంగాణ జిల్లాల ఇన్‌చార్జి పొలాస నరేందర్ మాట్లాడుతూ.. నిజాం వ్యతిరేక పోరాటంలో చురుకైన పాత్ర పోషించిన బాపూజీ, పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడని అన్నారు.

ఇవి కూడా చదవండి

1969 తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌కు మద్దతుగా మంత్రి పదవికి రాజీనామా చేసి త్యాగానికి ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం సాధించేందుకు బాపూజీ నిరంతరం కృషి చేశారని తెలిపారు.

బలహీన, వెనుకబడిన, అణగారిన వర్గాలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్య, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని నరేందర్ అన్నారు. వెనుకబడిన వర్గాల హక్కులు, మండల్ కమిషన్ అమలు, బహుజన సామాజిక న్యాయం, రాజకీయ సాధికారత కోసం బాపూజీ స్వరం వినిపించారని పేర్కొన్నారు.

కుల వృత్తులపై ఆధారపడి జీవించే వర్గాలకు ఉపాధి, గౌరవప్రదమైన జీవనం కల్పించాలన్నది బాపూజీ ఆశయమని తెలిపారు. నిరాడంబర జీవితాన్ని గడిపిన ఆయన ఆశయాలు, ఆలోచనలు, సిద్ధాంతాలు, ఆదర్శాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు.

కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం బీసీ సమాజానికి ఆదర్శమని, ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని పొలాస నరేందర్ పిలుపునిచ్చారు.