Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

విలాసాగర్ చెరువులోకి నీరు బీఆర్‌ఎస్ నిరసనతో అధికారులు నీటిని విడుదల చేశారన్న మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్

Author TELANGANA ADDA NEWS | 26 Sep 2026, 03:48 PM | Politics
విలాసాగర్ చెరువులోకి నీరు  బీఆర్‌ఎస్ నిరసనతో అధికారులు నీటిని విడుదల చేశారన్న మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్

విలాసాగర్ చెరువులోకి నీరు

బీఆర్‌ఎస్ నిరసనతో అధికారులు నీటిని విడుదల చేశారన్న మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్

బోయినీపల్లి తెలంగాణ అడ్డా ప్రతినిధి
చొప్పదండి నియోజకవర్గం బోయినీపల్లి మండలం మర్లపేట గ్రామ పరిధిలోని వరద కాలువ నుంచి విలాసాగర్ చెరువును నింపాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, విలాసాగర్ గ్రామ రైతులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా సుంకే రవిశంకర్ సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి విలాసాగర్ చెరువును నింపేందుకు వెంటనే నీటిని విడుదల చేయాలని కోరారు. అనంతరం అధికారులు నీటిని విడుదల చేయడంతో విలాసాగర్ చెరువులోకి నీరు చేరింది.

చెరువులోకి నీరు రావడంతో విలాసాగర్‌తో పాటు పరిసర గ్రామాల రైతులు ఆనందం వ్యక్తం చేశారు. పంటలకు సాగునీటి భరోసా కల్పించేలా స్పందించిన అధికారులకు, చెరువు నింపేందుకు నిరసన చేపట్టిన సుంకే రవిశంకర్‌కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

బీఆర్‌ఎస్ చేపట్టిన నిరసన అనంతరం చెరువులోకి నీరు రావడంతో రైతులకు ప్రయోజనం కలిగిందని పార్టీ నాయకులు పేర్కొన్నారు.