విలాసాగర్ చెరువులోకి నీరు బీఆర్ఎస్ నిరసనతో అధికారులు నీటిని విడుదల చేశారన్న మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్

విలాసాగర్ చెరువులోకి నీరు
బీఆర్ఎస్ నిరసనతో అధికారులు నీటిని విడుదల చేశారన్న మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్
బోయినీపల్లి తెలంగాణ అడ్డా ప్రతినిధి
చొప్పదండి నియోజకవర్గం బోయినీపల్లి మండలం మర్లపేట గ్రామ పరిధిలోని వరద కాలువ నుంచి విలాసాగర్ చెరువును నింపాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, విలాసాగర్ గ్రామ రైతులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా సుంకే రవిశంకర్ సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి విలాసాగర్ చెరువును నింపేందుకు వెంటనే నీటిని విడుదల చేయాలని కోరారు. అనంతరం అధికారులు నీటిని విడుదల చేయడంతో విలాసాగర్ చెరువులోకి నీరు చేరింది.
చెరువులోకి నీరు రావడంతో విలాసాగర్తో పాటు పరిసర గ్రామాల రైతులు ఆనందం వ్యక్తం చేశారు. పంటలకు సాగునీటి భరోసా కల్పించేలా స్పందించిన అధికారులకు, చెరువు నింపేందుకు నిరసన చేపట్టిన సుంకే రవిశంకర్కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
బీఆర్ఎస్ చేపట్టిన నిరసన అనంతరం చెరువులోకి నీరు రావడంతో రైతులకు ప్రయోజనం కలిగిందని పార్టీ నాయకులు పేర్కొన్నారు.