Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

జేఎన్టీయూ గోల్డెన్ జూబ్లీ భవన నిర్మాణంలో భారీ అక్రమాలు.. రూ.30 కోట్లకు టెండర్ దక్కించుకుని రూ.50 కోట్లు కొట్టేసిన వైనం

జేఎన్టీయూ గోల్డెన్ జూబ్లీ భవన నిర్మాణంలో భారీ అక్రమాలు.. రూ.30 కోట్లకు టెండర్ దక్కించుకుని రూ.50 కోట్లు కొట్టేసిన వైనం

హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా:
హైదరాబాద్‌లోని జేఎన్టీయూ (JNTU) క్యాంపస్‌లో విశ్వవిద్యాలయం యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మించిన 'గోల్డెన్ జూబ్లీ భవన' నిర్మాణంలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ అంశంపై విజిలెన్స్ విభాగం అధికారులు రంగంలోకి దిగి దానికి సంబంధించిన ఫైళ్లపై వివరాలను ఆరా తీస్తున్నారు.
టెండర్ - వ్యత్యాసాలు: జేఎన్టీయూ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రూ.50 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళికలు రూపొందించగా, జీఎస్టీ, లేబర్ సెస్ మినహాయించుకుని రూ.40 కోట్ల ఖర్చు అవుతుందని టెండర్లు ఆహ్వానించారు. కాంట్రాక్టర్ 23 శాతం లెస్‌తో రూ.30.80 కోట్లకు టెండర్‌ను దక్కించుకున్నారు.
భారీగా పెరిగిన బిల్లులు: రూ.30 కోట్లతో నిర్మిస్తామంటూ కాంట్రాక్టు తీసుకున్న గుత్తేదారులు, నిర్మాణం పూర్తయ్యేసరికి రూ.50 కోట్లు ఖర్చయ్యిందంటూ ఏకంగా రూ.20 కోట్లు అదనంగా బిల్లులు తీసుకున్నారని యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు, ప్రొఫెసర్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో విజిలెన్స్ విచారణ చేపట్టారు.
లోపాయికారీ ఒప్పందాలు: భవన నిర్మాణ అంచనా వ్యయాన్ని లెక్కగట్టేటప్పుడే యూనివర్సిటీలోని ఇద్దరు ఉన్నతాధికారులు కాంట్రాక్టర్‌తో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారనే ఆరోపణలున్నాయి. సాధారణంగా కాంట్రాక్టర్లు టెండర్ ధర కంటే గరిష్ఠంగా 10 శాతం వరకు మాత్రమే తక్కువ కోట్ చేస్తారు. కానీ ఇందుకు భిన్నంగా 23 శాతం లెస్సుతో (రూ.9.20 కోట్లు తక్కువకు) టెండర్ దక్కించుకుని, భవనం పూర్తయ్యాక వివిధ రూపాల్లో మొత్తం రూ.50 కోట్లు వ్యయాన్ని లెక్కల్లో చూపారు.
అధికారుల పాత్ర: ఈ అదనపు బిల్లుల చెల్లింపు వ్యవహారంలో నాటి మాజీ ఉన్నతాధికారి, ఆర్థిక విభాగం అధికారి అక్రమాలకు పాల్పడ్డారన్నది ప్రధాన ఆరోపణగా ఉంది.
నిర్లక్ష్యపు నిర్మాణం: భవనం నిర్మించిన అనంతరం వీసీ, రిజిస్ట్రార్ ఛాంబర్‌లకు అవి అనుకూలంగా లేవంటూ ఏడాది పాటు ఆ భవనాన్ని ఖాళీగా ఉంచారు. ప్రస్తుత వీసీ ప్రొఫెసర్ టీకేకే రెడ్డి చొరవతో స్వల్ప మార్పులు చేయించి ఆ భవనాన్ని విద్యార్థులకు తరగతి గదులు, ల్యాబ్‌లుగా అందుబాటులోకి తెచ్చారు. ఈ అక్రమాలపై విజిలెన్స్ విచారణ వేగవంతం కావడంతో వర్సిటీ వర్గాల్లో కలకలం రేగింది.

జేఎన్టీయూ గోల్డెన్ జూబ్లీ భవన నిర్మాణంలో భారీ అక్రమాలు.. రూ.30 కోట్లకు టెండర్ దక్కించుకుని రూ.50 కోట్లు కొట్టేసిన వైనం - Additional Image