జేఎన్టీయూ గోల్డెన్ జూబ్లీ భవన నిర్మాణంలో భారీ అక్రమాలు.. రూ.30 కోట్లకు టెండర్ దక్కించుకుని రూ.50 కోట్లు కొట్టేసిన వైనం
హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా: హైదరాబాద్‌లోని జేఎన్టీయూ (JNTU) క్యాంపస్‌లో విశ్వవిద్యాలయం యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మించిన 'గోల్డెన్ జూబ్లీ భవన' నిర్మాణంలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ అంశంపై విజిలెన్స్ విభాగం అధికారులు రంగంలోకి దిగి దానికి సంబంధించిన ఫైళ్లపై వివరాలను ఆరా తీస్తున్నారు. టెండర్ - వ్యత్యాసాలు: జేఎన్టీయూ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రూ.50 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళికలు రూపొందించగా, జీఎస్టీ, లేబర్ సెస్ మినహాయించుకుని రూ.40 కోట్ల ఖర్చు అవుతుందని టెండర్లు ఆహ్వానించారు. కాంట్రాక్టర్ 23 శాతం లెస్తో రూ.30.80 కోట్లకు టెండర్‌ను దక్కించుకున్నారు. భారీగా పెరిగిన బిల్లులు: రూ.30...