Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

సర్దార్ వల్లభభాయ్ పటేల్‌కు ఘన నివాళులు

Author TELANGANA ADDA NEWS | 31 Oct 2026, 06:08 PM | Politics
సర్దార్ వల్లభభాయ్ పటేల్‌కు ఘన నివాళులు

జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా బీసీ సాధికారిత సంఘం నేత పొలాస నరేందర్ నివాళులు

తెలంగాణ అడ్డా ప్రతినిధి వేములవాడ

భారత స్వాతంత్ర్య సమరయోధుడు, భారత తొలి ఉప ప్రధాని, భారతరత్న, ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా బీసీ సాధికారిత సంఘం ఉత్తర తెలంగాణ జిల్లాల ఇంచార్జీ పొలాస నరేందర్ ఘన నివాళులు అర్పించారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్యానంతరం దేశంలోని 560కి పైగా సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేయడంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసే ప్రక్రియలోనూ ఆయన కీలకంగా వ్యవహరించారని పేర్కొన్నారు.

దేశ సమైక్యత, సమగ్రత కోసం పటేల్ చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకుని నిర్వహించే జాతీయ ఐక్యతా దినోత్సవం దేశ ప్రజలందరిలో ఐక్యతా భావాన్ని పెంపొందించే రోజని తెలిపారు.

స్వాతంత్ర్య ఫలాలు, రాజ్యాంగ హక్కులు సమాజంలోని అన్ని వర్గాలకు సమానంగా అందాలని, సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం ప్రతి ఒక్కరికీ లభించాలని ఆకాంక్షించారు. సామరస్యమే దేశానికి బలమని, భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ గొప్పతనమని పొలాస నరేందర్ పేర్కొన్నారు. బీసీ సాధికారిత సంఘం పక్షాన సర్దార్ వల్లభభాయ్ పటేల్‌కు మరోసారి ఘన నివాళులు అర్పించారు.