Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

Author Thirupathi Pannala | 30 Oct 2026, 10:12 PM |
రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం


రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు


పెద్దపల్లి జిల్లా అక్టోబర్ 30 తెలంగాణ అడ్డా
ఎలినో పరిస్థితులను ఎదుర్కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమ ధ్యేయంగా చిత్తశుద్ధితో కార్యాచరణ రూపొందిస్తోందని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే శ్రీ చింతకుంట విజయ రమణారావు అన్నారు. సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో చిన్న బొంకూర్, పేరుకపల్లి, రెబ్బల్దేవ్ పల్లి గ్రామాలలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో వడ్లకు ఉన్న డిమాండ్ ను ఆసరా చేసుకొని మధ్య దళారులు రైతులను మోసం చేసే అవకాశాలు ఉన్నాయని, అందువల్ల రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. గోటీ పేరిట రైతులను మోసం చేస్తే సహించేది లేదన్నారు. అలాగే వ్యాపారులు, దళారులు సిండికేట్ గా మారి వడ్ల ధర తగ్గించేందుకు కుట్రలు పన్నుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి ప్రయత్నాలను దళారులు మానుకోవాలని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ వడ్ల కొనుగోలు సెంటర్లలో మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్ వెంటనే చెల్లించడం జరుగుతుందన్నారు. ఇంతకంటే ఎక్కువ రేటు లభిస్తే రైతులు అవకాశాలను వదులుకోవద్దని ఆయన సూచించారు. అయితే వెంటనే నగదు అందజేస్తేనే వడ్లు లోడ్ చేయాలని ఆయన అన్నారు. వచ్చే యాసంగి పంట కాలానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వరి పంట వేయవద్దని కోరారు. కేవలం తాగునీటి అవసరాలకే ఎస్సారెస్పీ నీటిని వినియోగించడం జరుగుతుందన్నారు. ఆరుతడి పంటలు వేసుకునే రైతులందరికీ తమ ప్రభుత్వం అండగా ఉంటుందని, అవసరమైన సహాయ సహకారాల తోపాటు పంటలకు మద్దతు ధర చెల్లించడం జరుగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాష్ రావు, సింగిల్ విండో చైర్మన్ గౌరవెల్లి మురళీధర్ రావు, మండల పార్టీ అధ్యక్షులు చిలుక సతీష్, సింగిల్ విండో డైరెక్టర్లు, కార్యదర్శి, సర్పంచులు, మాజీ సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి