Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

రికార్డులకు ర్యాకులు లేవు కంప్యూటర్లకు ఇంటర్నెట్ లేదు కరీంనగర్ ఐడీవోసీలో మౌలిక వసతుల కొరత

Author Karimnagar | 29 Oct 2026, 07:56 PM | Array
రికార్డులకు ర్యాకులు లేవు కంప్యూటర్లకు ఇంటర్నెట్ లేదు కరీంనగర్  ఐడీవోసీలో మౌలిక వసతుల కొరత

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా

ఆఘమేఘాల మీద కార్యాలయాల తరలింపు కొత్త భవనంలో పాత కష్టాలు పడుతున్న సిబ్బంది

రికార్డులకు ర్యాకులు లేవు కంప్యూటర్లకు ఇంటర్నెట్ లేదు కరీంనగర్  ఐడీవోసీలో మౌలిక వసతుల కొరత - Additional Image

ఫర్నిచర్కరవైనేలపైనేఫైళ్లమూటలుమందకొడిగా సాగుతున్న పాలనా సేవలు

కరీంనగర్‌లో ఘనంగా ప్రారంభమైన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఐడీవోసీ అనేక సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. నూతన భవనాలు నిర్మించి, ప్రభుత్వ కార్యాలయాలకు గదులు కేటాయించినప్పటికీ విధుల నిర్వహణకు అత్యంత అవసరమైన కనీస సౌకర్యాల కల్పనను మాత్రం అధికార యంత్రాంగం పూర్తిగా విస్మరించింది. ఫలితంగా ఐడీవోసీలోకి కొలువుదీరిన పలు ప్రభుత్వ శాఖలు, అక్కడికి వస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తరలింపునకు హడావుడి - వసతుల విస్మరణ

ఇవి కూడా చదవండి

ఉమ్మడి జిల్లా కేంద్రమైన కరీంనగర్‌లో సుమారు రూ.51 కోట్లతో జీ ప్లస్ టూ విధానంలో నిర్మించిన ఐడీవోసీ భవనాన్ని గత నెల 30న ప్రారంభించారు. అయితే, నిర్దేశించిన గడువులోగా కార్యాలయాలను తరలించకుంటే గదుల కేటాయింపు రద్దు చేస్తామన్న మౌఖిక ఆదేశాలతో అధికారులు హడావుడిగా రికార్డులను కొత్త భవనాల్లోకి మార్చారు. తీరా అక్కడకు వెళ్లాక కనీస వసతులు లేక సతమతమవుతున్నారు.

ఫర్నిచర్ కరవు - నేలపైనే రికార్డుల మూటలు

కొత్త భవనాలతోపాటే నూతన సామాగ్రి వస్తుందని అధికారులు భావించినప్పటికీ ఎవరి ఫర్నిచర్‌ వారే ఏర్పాటు చేసుకోవాలన్న నిబంధనలతో పలు శాఖల అధికారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. తుప్పు పట్టిన పాత టేబుళ్లు, కుర్చీలతోనే కాలం వెళ్లదీస్తుండగా విలువైన ప్రభుత్వ రికార్డులను భద్రపరిచేందుకు కనీసం ర్యాకులు, అల్మారాలు కూడా అందుబాటులో లేకపోవడంతో ఫైళ్లన్నీ నేలపైనే దర్శనమిస్తున్నాయి.

ఇంటర్నెట్ లేక నత్తనడకన సేవలు

ఫర్నిచర్ సమస్యకు తోడు ఐడీవోసీలో పూర్తిస్థాయి ఇంటర్నెట్ సౌకర్యం ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో కంప్యూటర్ల ఆధారంగా జరిగే ఆన్‌లైన్ పాలనా కార్యకలాపాలు నిలిచిపోయాయి. అత్యవసర పనుల కోసం సిబ్బంది తమ సొంత సెల్‌ఫోన్ హాట్‌స్పాట్‌లను ఆశ్రయించాల్సి వస్తోంది.
ప్రజలకు తప్పని తిప్పలు భవనాలు మారినా పాలనలో వేగం పెరగకపోగా, వివిధ పనుల నిమిత్తం దూర ప్రాంతాల నుంచి వస్తున్న సామాన్య ప్రజలకు సకాలంలో సేవలు అందడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ కార్యాలయాలను ఒకేచోటకు చేర్చి ప్రజలకు మెరుగైన, వేగవంతమైన సేవలు అందించాలన్న లక్ష్యం నెరవేరాలంటే ప్రభుత్వం స్పందించి తక్షణమే ఐడీవోసీలో ఫర్నిచర్, రికార్డుల భద్రతకు ర్యాకులు, ఇంటర్నెట్ వంటి కనీస మౌలిక సదుపాయాలను యుద్ధప్రాతిపదికన కల్పించాలని అన్ని వర్గాల ప్రజలు కోరుతున్నారు.