Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

బాధిత కుటుంబాలకు భరోసా కల్పించిన బీఆర్‌ఎస్ నేత చల్మెడ ఆస్పత్రిలో రోగులతో మాట్లాడిన లక్ష్మీనరసింహారావు

Author TELANGANA ADDA NEWS | 04 Oct 2026, 07:53 PM | Politics
బాధిత కుటుంబాలకు భరోసా కల్పించిన బీఆర్‌ఎస్ నేత  చల్మెడ ఆస్పత్రిలో రోగులతో మాట్లాడిన లక్ష్మీనరసింహారావు

మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచన

తెలంగాణ అడ్డా, కొనరావుపేట ప్రతినిధి :
చికిత్స పొందుతున్న పలువురు రోగులను బీఆర్‌ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు పరామర్శించారు. చల్మెడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన తక్కలపల్లి భారతి, వెంకట్రావుపేట గ్రామానికి చెందిన రామస్వామి, కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన పల్లికొండ రాజేష్‌లను ఆయన కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్యం, చికిత్సా విధానం, ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. వారి కుటుంబ సభ్యులతోనూ మాట్లాడి ధైర్యం కల్పించారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన వైద్య సేవలు, సౌకర్యాలు అందించాలని ఆస్పత్రి వైద్యులు, సిబ్బందికి సూచించారు.

ఇవి కూడా చదవండి

అనంతరం రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వైద్యులను కోరారు. ఈ సందర్భంగా రోగుల ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని ఆకాంక్షించారు. ఆయన వెంట ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు ఉన్నారు