Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

మణుగూరు బాలల సదనం ఆకస్మిక తనిఖీ చేసిన మేజిస్ట్రేట్ కంబపు సూరి రెడ్డి ...

Author TELANGANA ADDA NEWS | 26 Sep 2026, 07:49 PM | EDITORIAL
మణుగూరు బాలల సదనం ఆకస్మిక తనిఖీ చేసిన మేజిస్ట్రేట్ కంబపు సూరి రెడ్డి ...

మణుగూరు బాలల సదనం ఆకస్మిక తనిఖీ చేసిన మేజిస్ట్రేట్ కంబపు సూరి రెడ్డి ...

తెలంగాణ అడ్డా ,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి).

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల న్యాయ సేవా కమిటీ ఛైర్మన్, ప్రథమ శ్రేణి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కంబపు సూరి రెడ్డి శనివారం మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో ని శివలింగాపురం బాలిక సదనం (చిల్డ్రన్ హోం)ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సదనంలోని గదులు, వంటగది, ఆవరణతో పాటు పరిస రాలను పరిశీలించి పరిశుభ్రత, వసతి సౌకర్యాలపై ఆరా తీశారు. సదనం లోని చిన్నారులతో మేజిస్ట్రేట్ కొద్దిసేపు ముచ్చటించి వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా,భోజనం, వైద్యం, విద్య, ఇతర సౌకర్యాలు సక్రమంగా అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు.పిల్లల ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీసిన ఆయన, అవసరమైన వైద్య పరీక్షలు సకాలంలో నిర్వహించాలని సదనం నిర్వాహకులకు సూచించారు. చిన్నారులు చదువుపై శ్రద్ధ పెట్టి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులకు భయపడకుండా ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలని సూచించారు.ఏదైనా సమస్య ఎదురైతే నిర్వాహకులు, సంబంధిత అధికారులు లేదా న్యాయ సేవా సంస్థల దృష్టికి తీసుకురావాలని, పిల్లల హక్కుల పరిరక్షణకు న్యాయ సేవా సంస్థలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని తెలిపారు. సదనం నిర్వాహకులతో మాట్లాడుతూ పిల్లలకు అందుతున్న ఆహారం, తాగునీరు, వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లు,విద్యా సదుపాయా లు తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సదనంలో పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణాన్ని కల్పిస్తూ చిన్నారుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అనంతరం సదనం లోనే బాలికలకు మేజిస్ట్రేట్ స్వయంగా భోజన పదార్థాలను వడ్డించారు. ఆహార రుచులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సదనం చైల్డ్ వెల్ఫేర్ అధికారిణి దీప్తి రాణి, న్యాయవాది అంకం సర్వేశ్, లీగల్ సెల్ కోఆర్డినేటర్ రవీందర్, సదనం అసిస్టెంట్ కుమారి, కోర్టు కానిస్టేబుల్ బుచ్చిబాబు, హోంగార్డు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి