Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

సిరిసిల్లలో పర్యటిస్తే సరిపోదు.. నేరెళ్ల బాధితులకు ఏం న్యాయం చేశారో సీఎం సమాధానం చెప్పాలి తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

సిరిసిల్లలో పర్యటిస్తే సరిపోదు.. నేరెళ్ల బాధితులకు ఏం న్యాయం చేశారో సీఎం సమాధానం చెప్పాలి తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

రాజన్న సిరిసిల్ల ప్రతినిధి / తెలంగాణ అడ్డా:
సిరిసిల్లకు వచ్చి కేవలం సభలు, సమావేశాలు పెట్టుకుంటే సరిపోదని, ఏడేళ్లుగా అన్యాయానికి గురవుతున్న నేరెళ్ల బాధితులకు ప్రభుత్వం ఏం న్యాయం చేసిందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ స్పష్టం చేయాలని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
నేరెళ్ల ఘటనపై స్పందిస్తూ ఆమె తీవ్ర స్థాయిలో ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిషన్ నివేదిక ఇప్పటివరకు బయటకు రాలేదని, బాధ్యులైన ఏ ఒక్క పోలీసు అధికారికి కూడా ఇప్పటివరకు సరైన శిక్ష పడలేదని ఆరోపించారు. అప్పట్లో బాధితుల పేరుతో రాజకీయం చేసిన నాయకులు అధికారంలోకి వచ్చాక వారిని విస్మరించారని మండిపడ్డారు.
బాధితులకు తక్షణమే రూ. కోటి చొప్పున పరిహారం అందించి ఆదుకోవాలని, అసలైన దోషులను చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేశారు. బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయకుండా కేవలం రాజకీయ పర్యటనలు చేయడం వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదని, ఇది కేవలం రాజకీయ లబ్ధికే తప్ప ప్రజా సేవ కాదని కవిత స్పష్టం చేశారు.
ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.