కరీంనగర్ పౌరసరఫరాల కార్యాలయంలో విజిలెన్స్ మెరుపు దాడి
కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: బాధితుడి ఫిర్యాదుతో ఆకస్మిక తనిఖీలు చేసిన విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ బృందం కీలక దస్త్రాలు స్వాధీనం.. CMR బియ్యం బకాయిల వేళ అధికారుల తనిఖీలతో కలకలం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పౌరసరఫరాల శాఖ (Civil Supplies Department) కార్యాలయంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు మంగళవారం హఠాత్తుగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఓ బాధితుడి నుంచి వచ్చిన రాతపూర్వక ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన అధికారులు కార్యాలయంలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. తనిఖీల సమయంలో పౌరసరఫరాల కార్యాలయానికి సంబంధించిన పలు కీలక దస్త్రాలు (Files/Records) మరియు రికార్డులను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న దస్తావేజులను...