బాన్సువాడ నియోజక వర్గాన్ని కరువు ప్రభావిత ప్రాంతంగా గుర్తించాలి
తెలంగాణ అడ్డా ప్రతినిధి/ బాన్సువాడ: బాన్సువాడ : ఎల్ ని నో ప్రభావం రైతులకు ప్రత్యేక కరువు సహాయం అందించాలని శనివారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ కు బాన్సువాడ రైతులు ప్రజాప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు.ఎల్నినో ప్రభావం తో రానున్న రోజుల్లో వర్షాభావ పరిస్థితులు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉన్న నేపథ్యం లో బాన్సువాడ నియోజకవర్గ రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని బాన్సువాడ నియోజకవర్గ రైతుల ప్రతినిధులు కోరారు. వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాలు తగ్గి పోవడం, సాగునీటి కొరత, పంటల దిగుబడులు తగ్గే ప్రమాదం, పశువులకు మేత తాగునీటి సమస్యల ను దృష్టి లో ఉంచుకొని ముందస్తు కరువు నివారణ చర్యలు చేపట్టాలని...