చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన సంగీతం శ్రీనివాస్
ఓటు హక్కుల పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతుగా ఢిల్లీకి కాంగ్రెస్ శ్రేణులు బోయినిపల్లి, తెలంగాణ అడ్డా ప్రతినిధి: దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు చోరీకి వ్యతిరేకంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన ‘చలో ఢిల్లీ’ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి బయలుదేరారు. ఈ సందర్భంగా చలో ఢిల్లీ యాత్రను సంగీతం శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రత్యేక బస్సుల ద్వారా కాంగ్రెస్ శ్రేణులు రాజధానికి పయనమయ్యాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దేశంలో ఎన్నికల వ్యవస్థను, ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఓటు...