మాదిగ విద్యార్థులకు విద్యపై దిశానిర్దేశం ఎంఎస్ఎఫ్ నూతన గ్రామ కమిటీ ఎన్నిక

కమలాపూర్, తెలంగాణ అడ్డా ప్రతినిధి హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం నేరెళ్ల గ్రామంలో శుక్రవారం రాత్రి మాదిగ విద్యార్థులతో సమావేశం నిర్వహించి, ఎంఎస్ఎఫ్ నూతన గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు చేపట్టిన కమిటీల ఎన్నికల్లో భాగంగా ఎమ్మార్పీఎస్ కమలాపూర్ మండల అధ్యక్షుడు గోల్కొండ శ్రీకాంత్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి కమలాపూర్ మండల ఇన్‌చార్జి శనిగరపు రవీందర్ మాదిగ, ఎంఎస్పీ మండల అధ్యక్షుడు శనిగరపు చేరాలు మాదిగ, ఎంఎస్పీ మండల ఉపాధ్యక్షుడు గోల్కొండ నాగరాజు మాదిగ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ చదువుకు దూరం కావద్దని సూచించారు....