ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో గంజివాగు వంతెన అప్రోచ్ రోడ్డుకు రూ.10 లక్షలు మంజూరు: ఉత్తర్వులు జారీ
తెలంగాణ అడ్డా ప్రతినిధి బోయిన్పల్లి: బోయినిపల్లి నుండి వేములవాడ వెళ్లే ప్రధాన రహదారిలోని గంజివాగు వద్ద నూతనంగా నిర్మించిన బ్రిడ్జికి ఇరువైపులా సీసీ అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి స్థానిక శాసనసభ్యులు (ఎమ్మెల్యే) గారి ప్రత్యేక చొరవ తో రూ. 10 లక్షల నిధులను మంజూరు అయ్యాయి. ఇందుకు సంబంధించిన పరిపాలనా అనుమతుల ప్రొసీడింగ్స్ (Proc No: A8/333/2026-46) ఉత్తర్వులను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశాల మేరకు అధికారులు అధికారికంగా విడుదల చేశారు. బోయినిపల్లి మండలం స్తంభంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గంజివాగుపై ఇటీవల నిర్మించిన హైలెవెల్ బ్రిడ్జి పనులు పూర్తయ్యాయి. అయితే వంతెనకు ఇరువైపులా సరైన అనుసంధాన రహదారి (అప్రోచ్ రోడ్డు)...