స్తంభంపల్లి హైస్కూల్లో మినీ కిచెన్ గార్డెన్ ప్రారంభం
విద్యార్థుల్లో ప్రకృతి పరిరక్షణపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం తెలంగాణ అడ్డా ప్రతినిధి బోయిన్పల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం స్తంభంపల్లి గ్రామంలోని హైస్కూల్ ఆవరణలో మినీ కిచెన్ గార్డెన్‌ను గ్రామ సర్పంచ్ బొంగాని అశోక్ గౌడ్ ప్రారంభించారు. హిందీ పండిట్ రాముల సతీష్ కుమార్ తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన ఈ కూరగాయల తోట విద్యార్థుల్లో మొక్కల పెంపకం, ప్రకృతి పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు దోహదపడనుంది. ఈ సందర్భంగా సర్పంచ్ బొంగాని అశోక్ గౌడ్ మాట్లాడుతూ.. పాఠశాల ఆవరణలో మినీ కూరగాయల తోట ఏర్పాటు చేయడం మంచి ఆలోచన అని అన్నారు. ఈ తోట ద్వారా విద్యార్థులు కూరగాయల సాగు, మొక్కల పెంపకం,...