పినపాక ఎమ్మెల్యే, కమిటీ చైర్మన్ పాయం ను కలిసిన ఏ ఎం సి కార్యదర్శులు...
తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి) పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లుని బూర్గంపహాడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ స్పెషల్ గ్రేడ్ కార్యదర్శి కెంసారం శారద, భద్రాచలం వ్యవసాయ మార్కెట్ కమిటీ గ్రేడ్-1 కార్యదర్శి కనక శేఖర్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో ఎమ్మెల్యే పాయం ను కలిసి పుష్పగు చ్ఛంతో అభివాదం చేశారు.ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీల నిర్వహణ,రైతులకు అందుతున్న సేవలు, వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్ర యాలకు సంబంధించిన అంశాలపై పరస్పరం మాట్లాడుకున్నారు.రైతులకు మెరుగై న సేవలు అందించడం,వ్యవసా య మార్కెట్ కమిటీల ద్వారా రైతులకు అవసరమైన...