చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఉంది రాష్ట్ర ప్రభుత్వ తీరు ఎల్‌నినో నిర్వహణపై తెలంగాణ రక్షణ సేన ధ్వజం

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: క్షేత్రస్థాయికి అధికారులు వెళ్లేవరకూ పంటనష్టం అంచనా వేయకపోవడం ఘోరం: గుంజపడుగు హరిప్రసాద్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం కరువు, బల్దియాలో డీజిల్ కుంభకోణంపై విచారణ జరపాలని డిమాండ్ రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం మరియు వాతావరణ మార్పులపై ముందస్తు చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఇప్పుడు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించడం ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు’ ఉందని తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ విమర్శించారు. శుక్రవారం కరీంనగర్‌లోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పొలాలు ఎండిపోయి అల్లాడుతున్న రైతులను తక్షణమే ఆదుకోవాలని, మిగిలిన పంటలను...