వరద వెళ్లి గ్రామంలో తాగునీటి కష్టాలు రోడ్ నంబర్‌–10లో నీటి కొరతతో ప్రజల ఇబ్బందులు

సమస్యను పరిష్కరించాలని అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు వల్లంపట్ల తిరుపతి డిమాండ్ చేశారు తెలంగాణ అడ్డా ప్రతినిధి బోయిన్పల్లి వరద వెళ్లి గ్రామంలోని రోడ్ నంబర్‌–10లో తాగునీటి కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు వల్లంపట్ల తిరుపతి ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో నీటి కొరత కారణంగా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని తెలిపారు. సమస్యను పరిష్కరించడంలో గ్రామ సర్పంచ్‌ తగిన చొరవ చూపడం లేదని ఆయన ఆరోపించారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సర్పంచ్‌ వెంటనే స్పందించి, రోడ్ నంబర్‌–10లో తాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని వల్లంపట్ల తిరుపతి డిమాండ్ చేశారు.