ఘనంగా కొమరం భీం విగ్రహా విష్కరణ...

ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు, పాయం వెంకటేశ్వర్లు,తెల్లం వెంకట్రావు. తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి). దుమ్ముగూడెం మండలం ములకపాడు వై జంక్షన్ వద్ద ఆదివాసీ పోరాట యోధుడు కొమరం భీం విగ్రహావిష్కరణ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా ,మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అన సూయ సీతక్కతో కలిసి పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంక టేశ్వర్లు,ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు,చందా లింగయ్య దొర,తాటి వెంకటేశ్వర్లు, ఆది వాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొమరం భీం విగ్రహాన్ని ఆవిష్కరించి,ఆయనకు...