శివానంద హాస్పిటల్ ఫైర్ ఎన్‌ఓసీని తక్షణమే రద్దు చేయాలి 27వ డివిజన్ కార్పొరేటర్ బోట్ల శ్యామల-కిరణ్ కుమార్ (టిల్లు) ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం సమర్పణ

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నోటీసులు ఇస్తామని ఫైర్ ఆఫీసర్ హామీ కరీంనగర్ నగర పరిధిలోని ‘శివానంద & మెటర్నిటీ హాస్పిటల్‌’లో తెలంగాణ అగ్నిమాపక చట్టం - 1999 మరియు నేషనల్ బిల్డింగ్ కోడ్ (NBC-2016) నిబంధనల ప్రకారం కనీస అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని కరీంనగర్ నగరపాలక సంస్థ 27వ డివిజన్ కార్పొరేటర్ బోట్ల శ్యామల - తంగేళ్ళ కిరణ్ కుమార్ (టిల్లు) తీవ్ర ఆరోపణలు చేశారు. ఆసుపత్రి భవనాన్ని తక్షణమే క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి, నిబంధనలు పాటించే వరకు ఫైర్ ఎన్‌ఓసీ నిలిపివేయాలని లేదా రద్దు చేయాలని కోరుతూ గురువారం రోజున ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్...