ప్రజాధనానికి గండి సొంత కార్లకే ప్రభుత్వ సబ్సిడీలు కరీంనగర్లో ఓ మాజీ ఛైర్మన్ లీలలు!
కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: రెండేళ్ల నామినేటెడ్ పదవి కాలంలో సొంత వాహనానికే రూ. 8.40 లక్షల ప్రభుత్వ నిధుల డ్రా! నిబంధనలకు విరుద్ధంగా జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలంటూ స్థానికులు, సామాజిక కార్యకర్తల డిమాండ్ ప్రజాసేవ చేయాల్సిన ప్రజాప్రతినిధులు, నామినేటెడ్ పదవుల్లో ఉన్న నాయకులు ప్రభుత్వ సొమ్మును ఏ విధంగా తమ సొంత ప్రయోజనాలకు వాడుకుంటారో చెప్పడానికి కరీంనగర్లో వెలుగుచూసిన ఈ ఘటనే ఒక ప్రత్యక్ష నిదర్శనం. ప్రజల పన్నుల డబ్బుతో నడిచే ప్రభుత్వ ఖజానాను కాపాడాల్సిన చోటే, అడ్డగోలుగా నిధుల మళ్లింపు జరిగిందనే వార్త ప్రస్తుతం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. అసలేం జరిగింది? కరీంనగర్‌కు చెందిన ఓ...