సమ్మక్క గద్దెల దారిపై ఆక్రమణల కలకలం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన కార్పొరేటర్ ఇష్టియాక్ అహ్మద్ జమ్మూ!

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: ​బొమ్మకల్ 34వ డివిజన్‌లో ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్న ఫెన్సింగ్ ​ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించిన కార్పొరేటర్ కరీంనగర్ నగర పరిధిలోని బొమ్మకల్ 34వ డివిజన్‌లో సమ్మక్క గద్దెలకు వెళ్లే ప్రధాన రహదారి ఆక్రమణకు గురికావడంపై స్థానికంగా తీవ్ర కలకలం రేగుతోంది. భక్తులు, ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే ఈ దారికి కొందరు వ్యక్తులు అక్రమంగా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఆటంకం కలిగిస్తున్నారని ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ​ఈ విషయమై 34వ డివిజన్ కార్పొరేటర్ ఇష్టియాక్ అహ్మద్ జమ్మూ ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని, జిల్లా కలెక్టర్‌కు స్వయంగా వినతిపత్రం అందజేశారు. ​ముఖ్య విషయాలు: ​రహదారి...