ఉచితంగా ప్రకటనలు...? ప్రకటనలకు ముఖం చాటు....!.
జర్నలిస్టుల వార్తలతో రాజకీయ ప్రచారం... ప్రకటనల దగ్గర మాత్రం చేతులెత్తేస్తారా? తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి). ఏడాది పొడవునా రాజకీయ నాయ కుల కార్యక్రమాలు, సమావేశాలు, పర్యటనలు, ప్రకటనలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జర్నలిస్టులు వార్తలు రాస్తూనే ఉంటారు. ఎలాంటి ప్రతి ఫలం ఆశించకుండా తమ వృత్తిలో భాగంగా రాజకీయ నాయకులకు ప్రచారం కల్పిస్తుంటారు.కానీ ఏడా దికి రెండుసార్లు వచ్చే దసరా, నూతన సంవత్సర క్యాలెండర్ ప్రకటనల విషయంలో మాత్రం కొందరు రాజకీయ నాయకులు ముఖం చాటేయడం ఎంతవరకు సమంజసం? వార్తలు కావాలంటే గుర్తొస్తారు.. ప్రకటనలు అడిగితే కనిపించరా? జర్నలిస్టులు ప్రకటనల కోసం కార్యాల యాలకు వస్తే కనీస స్పందన కూడా ఇవ్వకపోవడం, ప్రకటనల...