బొమ్మకల్‌లో సద్దుల బతుకమ్మ వేడుకలకు శరవేగంగా ఏర్పాట్లు – పనులను పరిశీలించిన మేయర్ కొలగాని శ్రీనివాస్

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: అధికారులతో కలిసి చెరువు కట్ట, నిమజ్జనం ఘాట్లను తనిఖీ చేసిన మేయర్ కొలగాని శ్రీనివాస్, నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు మహిళలకు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశం తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని బొమ్మకల్‌లో సద్దుల బతుకమ్మ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. స్థానిక ఆచార వ్యవహారాల ప్రకారం ఏడు రోజుల్లో జరగనున్న సద్దుల బతుకమ్మ వేడుకల ఏర్పాట్లను కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర...