కరకగూడెం.. రవిచంద్ర హత్య కేసులో నిందితుడి అరెస్ట్...

తెలంగాణ అడ్డా న్యూస్, ( భద్రాద్రి జిల్లా ప్రతినిధి). కలువల నాగారం గ్రామానికి చెందిన బాధావత్ రవిచంద్ర హత్య కేసులో నిందితుడు మహమ్మద్ ఇమ్రాన్‌ను కరకగూడెం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.రూ.80 వేల అప్పు విషయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన వివాదమే హత్యకు కారణమని పోలీసులు తెలిపారు.ఈ నెల 11న రాత్రి రవిచంద్రను మోటార్‌సైకిల్‌పై కలువల నాగారం గ్రామ శివారుకు తీసుకెళ్లిన ఇమ్రాన్..బెల్టుతో గొంతు బిగించి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.ఈ ఘటనపై మృతుడి తల్లి బాధావత్ విజయ ఈ నెల 12న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.ఈ నెల 14న నిందితుడిని అతని ఇంటి వద్ద అరెస్టు చేసిన పోలీసులు.....