సాగునీటి కోసం గంగుల సమరశంఖం ఎస్సారెస్పీ డీ-86 కెనాల్ వద్ద రైతులతో కలిసి ధర్నా!
కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ కెనాల్ వద్దకు చేరుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నీళ్లు విడుదల చేయకుంటే బ్రిడ్జిపై నుంచి దూకుతానని అధికారులకు ఘాటు హెచ్చరిక అధికారులతో చర్చలు జరిపి 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేయించిన ఎమ్మెల్యే కరీంనగర్ మరియు చొప్పదండి నియోజకవర్గాల పరిధిలోని రైతాంగ సాగునీటి హక్కుల సాధన కోసం మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పోరుబాట పట్టారు. కళ్లముందే పంటలు ఎండిపోయే పరిస్థితి దాపరించినా అధికారుల నిర్లక్ష్యం వల్ల సాగునీరు అందకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, రైతాంగాన్ని వెంటబెట్టుకుని ఎస్సారెస్పీ (SRSP) డీ-86 కెనాల్ వద్ద భారీ...