బోయినిపల్లికి రూ.12 కోట్లతో మినీ స్టేడియం మంజూరుకు యువత సంబరాలు.. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు ఘన స్వాగతం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు
తెలంగాణ అడ్డా ప్రతినిధి బోయిన్పల్లి బోయినిపల్లి మండల కేంద్రానికి మినీ స్టేడియం మంజూరు కావడంతో బోయినిపల్లి యువత ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా నిర్వహించారు. మినీ స్టేడియం నిర్మాణానికి రూ.12 కోట్ల నిధులు మంజూరు కావడంపై యువత, కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. నిధుల మంజూరుకు కృషి చేసిన చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం చిత్రపటానికి కూడా పాలాభిషేకం చేశారు. మినీ స్టేడియం మంజూరులో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రత్యేక చొరవ చూపారని యువత పేర్కొన్నారు. మండల యువతకు మెరుగైన క్రీడా సౌకర్యాలు కల్పించాలనే...