వేములవాడ నియోజకవర్గంలో 98 శాతం పూర్తయిన ‘సర్’ ప్రక్రియ నవంబర్ 9న తుది ఓటర్ల జాబితా ప్రచురణ: ఆర్డీఓ కె.ఎస్.బి.కుమారి

తెలంగాణ అడ్డా వేములవాడ ప్రతినిధి వేములవాడ నియోజకవర్గంలో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (ఎస్‌ఐఆర్‌/సర్) 98 శాతం పూర్తయిందని, ప్రస్తుతం చివరి దశలో ఉందని ఆర్డీఓ కె.ఎస్.బి.కుమారి తెలిపారు. తుది ఓటర్ల జాబితా ప్రచురణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, నవంబర్ 9న తుది జాబితాను అధికారికంగా ప్రచురించనున్నట్లు వెల్లడించారు. వేములవాడ ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించిన అఖిలపక్ష రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో ఆర్డీఓ ఈ వివరాలను వెల్లడించారు. ‘సర్’ ప్రక్రియ విజయవంతంగా కొనసాగేందుకు సహకరించిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, బీఎల్ఏలు, బీఎల్వోలు, ఎన్నికల సిబ్బందికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. క్లెయిములు, అభ్యంతరాల స్వీకరణకు బుధవారమే చివరి గడువు అని,...