డా. ప్రసన్న హరికృష్ణను మర్యాదపూర్వకంగా కలిసిన కొంకటి శేఖర్

హైదరాబాద్, అక్టోబర్ 5 (తెలంగాణ అడ్డా): విన్నర్ పబ్లికేషన్స్ అధినేత డా. ప్రసన్న హరికృష్ణను బీఆర్‌ఎస్ నాయకుడు కొంకటి శేఖర్ సోమవారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డా. ప్రసన్న హరికృష్ణ చూపిన ఆత్మీయత, అభిమానం తనను ఎంతో ఆకట్టుకున్నాయని కొంకటి శేఖర్ తెలిపారు. సమాజం పట్ల ఆయనకున్న బాధ్యత, అంకితభావం తనను ఎంతగానో ప్రభావితం చేశాయని పేర్కొన్నారు. బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసే వ్యక్తులు ప్రజా సేవలోకి వస్తే సామాన్య ప్రజలకు మరింత మేలు జరుగుతుందని కొంకటి శేఖర్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్‌లో డా. ప్రసన్న హరికృష్ణ ప్రజా సేవలో మరింత కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.