స్తంభంపల్లిలో ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు మహాత్మా గాంధీ, శాస్త్రీజీల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలి: సర్పంచ్ బొంగాని అశోక్ గౌడ్
తెలంగాణ అడ్డా బోయినపల్లి ప్రతినిధి స్తంభంపల్లి గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు సర్పంచ్ బొంగాని అశోక్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అశోక్ గౌడ్ మాట్లాడుతూ.. గాంధీజీ ప్రబోధించిన సత్యం, అహింసా సిద్ధాంతాలు ప్రపంచానికే నిత్య ఆదర్శాలని అన్నారు. స్వాతంత్ర్య సంగ్రామంలో గాంధీజీ చేసిన త్యాగాలు, దేశానికి అందించిన సేవలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. నేటి యువత గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గంలో నడుస్తూ దేశ ఐక్యత, జాతీయ సమగ్రతను కాపాడాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి...