తెలంగాణలో పెరిగిన ఆటో ఛార్జీలు అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన రవాణా శాఖ

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ: దాదాపు 12 ఏళ్ల తర్వాత తెలంగాణలో ఆటో రిక్షా ఛార్జీలను సవరిస్తూ రవాణా శాఖ అధికారికంగా జీవో జారీ చేసింది. ఇంధన ధరలు, నిర్వహణ మరియు బీమా వ్యత్యాసాలను దృష్టిలో ఉంచుకుని ఈ నూతన ధరలను ఖరారు చేశారు. సవరించిన కొత్త ఛార్జీల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి: కనీస ఛార్జీ: మొదటి 1.6 కిలోమీటర్ల ప్రయాణానికి కనీస ఛార్జీని రూ. 20 నుండి రూ. 30కి పెంచారు. అదనపు కిలోమీటర్ల ధర: 1.6 కిలోమీటర్లు దాటిన తర్వాత ప్రతి అదనపు కిలోమీటర్‌కు రూ. 14 చొప్పున వసూలు చేయనున్నారు (గతంలో రూ. 11 ఉండేది). వెయిటింగ్ (డిటెన్షన్)...