చలో ఉస్మానియా యూనివర్సిటీ విజయవంతం చేయాలి
తెలంగాణ అడ్డా కొనరావుపేట ప్రతినిధి: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు MSF నూతన కమిటీల నిర్మాణంలో భాగంగా నేడు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట కేంద్రంలోనీ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఎమ్మార్పీఎస్ కొనరావుపేట మండల అధ్యక్షులు అక్కనపెల్లి సురేష్ మాదిగ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా MRPS మాజీ జిల్లా కన్వీనర్ ఎలగందుల బిక్షపతి మాదిగ హాజరై మాట్లాడుతూ.. సమాజంలో సబ్బండ వర్గాలకు పోరాటం చేసి సేవలు అందించిన చరిత్ర ఎమ్మార్పీఎస్ ఉందని, ఆరోగ్యశ్రీ పథకం వృద్ధులు వితంతువుల పెన్షన్, తెల్ల రేషన్ కార్డ్ బియ్యం కోటా పెంపు ఇలా చూసుకుంటే...