సింగారం పంచాయతీలో సమస్యలపై బీఆర్ఎస్ నిరసన...

భారీ ర్యాలీగా వెళ్లి పంచాయతీ కార్యాలయం ముందు నిరసన తెలిపిన టిఆర్ఎస్ నాయకులు. తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి). మణుగూరు సమితి సింగారం గ్రామ పంచాయతీలో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం భారీగా మహిళలకార్యకర్తలు, నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి పోశం నరసింహారావు, మండల పార్టీ అధ్యక్షులు కురి నాగేశ్వరరావు మాట్లాడు తూ..గ్రామంలో ఎక్కడ వేసిన చెత్త అక్కడే పేరుకుపోయి, పంచాయతీని మురికి కూపంగా మార్చారని నాయకులు ధ్వజమెత్తరు. చెత్తను ఎత్తే పరిస్థితి కూడా లేకపోవడం తో, పందుల సంచారం, మురుగునీటి పారుదల సక్రమంగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని...