భగత్‌సింగ్‌ ఆశయాలు యువతకు స్ఫూర్తిదాయకం ఓటర్ల జాబితాలో డూప్లికేట్‌ నమోదులను పరిశీలించాలని బీజేపీ నాయకుల వినతి

భగత్‌సింగ్‌ ఆశయాలు యువతకు స్ఫూర్తిదాయకం ఓటర్ల జాబితాలో డూప్లికేట్‌ నమోదులను పరిశీలించాలని బీజేపీ నాయకుల వినతి పటాన్‌చెరువు, సెప్టెంబర్‌ 28, తెలంగాణ అడ్డా: పటాన్‌చెరువు టౌన్‌లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భగత్‌సింగ్‌ జయంతి వేడుకలను నిర్వహించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐఆర్‌ అసెంబ్లీ కన్వీనర్‌ రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భగత్‌సింగ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం భగత్‌సింగ్‌ చేసిన త్యాగం, దేశభక్తి, ధైర్యం నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. అనంతరం ఓటర్ల జాబితా పరిశీలనకు సంబంధించి పటాన్‌చెరువు ఎమ్మార్వో కార్యాలయంలో...