వీరవనిత చాకలి ఐలమ్మకు ఘన నివాళులు తెలంగాణ చౌక్‌లో బీసీ సాధికారిత సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు

వీరవనిత చాకలి ఐలమ్మకు ఘన నివాళులు తెలంగాణ చౌక్‌లో బీసీ సాధికారిత సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు తెలంగాణ అడ్డా ప్రతినిధి వేములవాడ: వీరవనిత చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా బీసీ సాధికారిత సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్‌లోని ఐలమ్మ విగ్రహానికి బీసీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో బీసీ సాధికారిత సంఘం ఉత్తర తెలంగాణ జిల్లాల ఇంచార్జీ పొలాస నరేందర్, రాష్ట్ర రజక సంఘం నేత లింగంపల్లి దేవయ్య మాట్లాడారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం చాకలి ఐలమ్మ సాగించిన పోరాటం తెలంగాణ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని పొలాస...