నూనె బాలయ్య కుటుంబానికి చల్మెడ లక్ష్మీనరసింహారావు పరామర్శ
బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ధర్మారంలో దివంగత బాలయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు బీఆర్ఎస్ నాయకుడు జక్కుల నాగరాజును ఓదార్చిన చల్మెడ బృందం పార్టీ శ్రేణులకు ఏ కష్టమొచ్చినా వెన్నంటే ఉంటాం: చల్మెడ లక్ష్మీనరసింహారావు తెలంగాణ అడ్డా కొనరావుపేట సెప్టెంబర్ 22: నూనె బాలయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, వారి కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు బుధవారం పరామర్శించారు. గ్రామంలోని వారి నివాసానికి చేరుకున్న చల్మెడ, బాలయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాలయ్య కుటుంబ సభ్యులైన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు జక్కుల నాగరాజును, కుటుంబ సభ్యులను ఓదార్చి...